నంద్యాల జూలై 28 🙁 నందికొట్కూరు న్యూస్ ప్రతినిధి పగడం గోపి )
నంద్యాల వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుండి శ్రీనివాస్ సెంటర్ వరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, డిఎస్‌సి (DSC) నిర్వహణలో జరిగిన అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ ప్రజా క్షేత్ర పోరాటంలో వైఎస్‌ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటాసాని రాంభూపాల్ రెడ్డి , మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి , మాజీ ఎమ్మెల్యే కాటాసాని రామిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ భాషా మరియు వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో నిరుద్యోగ అభ్యర్థులు, విద్యార్థులు పాల్గొని ప్రభుత్వంపై తమ నిరసనను తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ భాషా గారు మాట్లాడుతూ..

👉గైడ్‌లైన్స్ ఉల్లంఘన: ప్రభుత్వం గైడ్‌లైన్స్ ప్రకారమే నోటిఫికేషన్ ఇచ్చామని చెబుతున్నప్పటికీ, అందులో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపించారు.
👉నవీన్ కేసు / స్టేట్ ఫస్ట్ వివాదం: NOC లేకుండా పరీక్ష రాసిన ఒక అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి (నవీన్) మొదట స్టేట్ ఫస్ట్ వచ్చినట్లు ప్రకటించి, ఆ తర్వాత రిజల్ట్ నుంచి పేరు తీసివేసి సెకండ్ లిస్ట్ ఇచ్చారని పేర్కొన్నారు.
👉బాధితుడికి అన్యాయం: సదరు అభ్యర్థి కోర్టును ఆశ్రయించగా, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరుకాలేదనే వంకతో అనర్హుడిగా చూపించడాన్ని తప్పుబట్టారు.
👉 స్పోర్ట్స్ కోటా దుర్వినియోగం: 409 పోస్టుల స్పోర్ట్స్ కోటా మరియు సంబంధిత GOలను మార్చేసి, అర్హత లేని తమ వర్గం వారికి ఉద్యోగాలు కట్టబెట్టారని విమర్శించారు.

1:1 రేషియో మోసం: సాధారణంగా 1:2 పిలవాల్సి ఉండగా, 1:1 పిలిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేశాక కూడా చాలామందికి ఉద్యోగాలు రాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

•పారదర్శకత లోపం: ఏ పరీక్షకైనా మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ స్పష్టంగా ఇవ్వాలి, కానీ ఏ లిస్టూ లేకుండా నేరుగా ఇంటర్వ్యూలకు పిలవడం ఏంటని ప్రశ్నించారు.

•CBI విచారణ డిమాండ్: దాదాపు 3.5 నుంచి 4 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారని, ఈ అక్రమాలపై ప్రభుత్వం నిర్దోషి అయితే CBI విచారణకు ఎందుకు భయపడుతోందో చెప్పాలని, విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

By 𝐃𝐫 𝐌 𝐇𝐀𝐑𝐈 𝐏𝐑𝐀𝐒𝐀𝐃

𝗗𝗿 🅼︎ 🅷︎🅰︎🆁︎🅸︎ 🅿︎🆁︎🅰︎🆂︎🅰︎🅳︎ is 🅳︎🅾︎🅲︎🆃︎🅾︎🆁︎. He is involved in providing 🅿︎🆄︎🅱︎🅻︎🅸︎🅲︎ 🆂︎🅴︎🆁︎🆅︎🅸︎🅲︎🅴︎🆂︎.