పత్రిక ప్రకటన
డేట్ 28/7/2026
సిపిఐ (ఎంఎల్ )లిబరేషన్ పార్టీ వ్యవస్థాపకులు. చార్ మజుందార్ గారి 53వ వర్ధంతి నందికొట్కూర్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మండల కార్యదర్శి కే స్వామన్న అధ్యక్షత వహించారు అనంతరం చార్ మజుందార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ. పేద ప్రజల కోసం
శ్రామిక వర్గ రాజ్యాధికారమే లక్ష్యంగా విప్లవోద్యమానికి నడుం కట్టిన గొప్ప భారత విప్లవోద్యమ కారుడు ప్రజల ప్రయోజనాలే పార్టీ ప్రయోజనాలుగా నమ్మినటువంటి ఏకైక వ్యక్తి.కామ్రేడ్ చారు మజుందార్. అని ఆయన అన్నారు
సిపిఐ (ఎంఎల్ )లిబరేషన్ పార్టీ నాయకత్వం.
దోపిడీ శక్తులకు వ్యతిరేకంగా శ్రామిక వర్గ రాజ్యాధికారమే లక్ష్యంగా విప్లవోద్యమానికి నడుము కట్టిన గొప్ప భారత విప్లవోద్యమ వైతాళికుడు, నేటి ఉద్యమాల చారు మంజుందార్ గారి 53.వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని భగత్ సింగ్ నగర్ లోని పార్టీ కార్యాలయం 1919 సంవత్సరం జూన్ నెలలో వారణాసిలో జన్మించారని, 1972 మార్చి 28వ తేదీ తెల్లవారుజామున 11 రోజుల పోలీసుల అమానుష హింసతో తుది శ్వాస విడిచారు. ఆయన తన 18 సంవత్సరాల వయసులోనే పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడని, ఆనాటి నుండి సామాజిక ఉద్యమాలలో పాల్గొంటూ కౌలు రైతుల ఉద్యమంతో కమ్యూనిస్టు పార్టీ సభ్యునిగా మారారని బెంగాల్లోని జుల్పాయిగురి రైతాంగ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని వారు గుర్తు చేశారు. 1943 బెంగాల్లో ఏర్పడిన తీవ్ర కరువులో కౌలుదారుల మిలిటెంట్ ఉద్యమానికి నాయకత్వం వహించారని ఆయన నాయకత్వం వహించిన ఉద్యమాలలో తెభాగా రైతాంగ పోరాటం కీలకమైనదని తెలిపారు. తన ఉద్యమ జీవితంలో అనేకమారులు అరెస్టై జైలు జీవితం గడిపిన వ్యక్తి ఆయన అని చైనా విప్లవం, మావో ఆలోచన విధానాన్ని విస్తృతంగా అధ్యయనం చేసి భారతదేశ పరిస్థితులకు అన్వయించి భవిష్యత్తు కార్యాచరణకు బాటలు వేశారని ఈ క్రమంలోనే 1969 ఏప్రిల్ 22వ తేదీన కామ్రేడ్ లెనిన్ జయంతి రోజున సిపిఐ ఎంఎల్ పార్టీ చారు మజుందార్ గారి నాయకత్వంలో ఏర్పడిందని, ఆనాటి నుండి నేటి వరకు ఇటు శ్రీకాకుళం నుండి అటు కాశ్మీర్ వరకు కార్మిక కర్షక రైతాంగ విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహిస్తూ రాజీలేని పోరాటాలను నిర్వహిస్తున్నదని వారు తెలిపారు. నాటి చారు మజుందార్ గారి ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని పార్టీ సభ్యులు ప్రజాసంఘాల నాయకులు నేటి బిజెపి నయవంచన పాలన వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా కార్యదర్శి షేక్ బిబి అధ్యక్షురాలు బి లక్ష్మీదేవి నందికొట్కూరు మండల కార్యదర్శి కాటే పోగు,స్వామన్న టౌన్ కార్యదర్శి మండల రామకృష్ణ మిడుతూరు మండల కార్యదర్శి మేకల చంద్రశేఖర్ షేకు ముజు రహిమాన్ జిల్లా కమిటీ సభ్యులు. వడ్డే సుధాకర్ శ్రీరాములు జి త్యాగరాజు.షేక్ మమ్మద్ భాష తాటిపాడు వలి తదితరులు పాల్గొన్నారు.
