నందికొట్కూరు పత్రిక ప్రకటన
నందికొట్కూరునియోజకవర్గంలో ఉన్న మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
నంద్యాల జిల్లా మిడుతూరు మండలం లో మొక్కజొన్న మినిమం పత్తి కంది ఉల్లి మిరపతదితర పంటలను మంగళవారం నాడు సిపిఎం నాయకులు ఓబులేసు. కర్ణ .గోపాలకృష్ణ శాజిదాబి. రైతులు ఖరీఫ్ సీజన్లో వేసిన పంటలు వెండి పోతున్న పంటలను చూసి వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం మండల తాసిల్దార్ కార్యాలయంలో డిపీట్ తాసిల్దార్ గారికి వినత పత్రం సమర్పించారు
అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో వేసిన పంటలు వర్షాలు సకాలంలో లేక పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని ఎకరాకు పదివేల నుంచి 50 వేల వరకు రైతులు బ్యాంకీలుల్లో ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టినారని అందుకు వెంటనే ప్రభుత్వము కరువు మండలాలుగా ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని ఎకరాకు 50 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కౌలు రైతుల బ్యాంకుల్లో రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని రెండో పంటకు ఉచితంగా విత్తనాలు ఎరువులు ఇవ్వాలని ఉపాధి హామీ పనులు అడిగిన వారందరికీ పనులు కల్పించి వలసలు నివారించాలని ఆయన డిమాండ్ చేశార ఈ కార్యక్రమంలో రైతులు సుబ్బారెడ్డి గపూర్ సంజీవరెడ్డి సమేశ్వరరావు తదితర రైతులు పాల్గొన్నారు
