80 బన్నూరు గ్రామంలో స్థానిక సమస్యలు పరిష్కరించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎం కర్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలంలోని 80బన్నూరు గ్రామంలో బుధవారం రోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సామాజిక శంఖారావం సర్వేలో వచ్చిన అంశాలపై సచివాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎం కర్ణ శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామంలో వీధిలైట్లు వేయాలని మసీదు వద్ద శివాలయం వద్ద ఉన్న బోర్లు బాగు చేయాలని దళితవాడల్లో డ్రైనేజీ నిర్మించాలని వాటర్ ట్యాంకి 15 రోజులకు ఒకసారి శుభ్రపరిచి మంచినీళ్లు అందించాలని వారు గ్రామ సెక్రెటరీ కి విజ్ఞప్తి చేశారు
వర్షాలు సకాలంలో పడక వేసిన పంటలు మొక్కజొన్న పత్తి కంది మినుము సోయసికుడుతదితర పంటలుపూర్తిగా దెబ్బ తిన్నాయని ప్రభుత్వం కరువు సహాయక చర్యలు చేపట్టి ఎకరాకు 50 వేలు చొప్పున పంటలకునష్టపరిహారం చెల్లించాలని రైతులో కౌలు రైతుల బ్యాంకు రుణాలు మాఫీ చేయాలని రెండో పంటకు ఉచితంగా విత్తనాలు ఎరువులు సరఫరా చేయాలని గ్రామంలో వ్యవసాయ పనులు లేనందువలన ఉపాధి హామీ పనులు పని అడిగిన వారందరకు పని కల్పించీ ప్రజా పంపిణీ ద్వారా నెలకు 16 రకాల ఉచిత సరుకులు పేదలకు అందించాలని వారు గ్రామ సెక్రెటరీ కి వినత పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో ఫరు భాష జనార్ధన్ మాసుం. గ్రామ ప్రజలు పాల్గొన్నారు
