ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త. 2024 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన పంటల బీమా బకాయిల విడుదలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో జరిపిన చర్చలు ఫలించాయని.. 2024 ఖరీఫ్ సీజన్ పంటల బీమా పెండింగ్ బకాయిల విడుదలకు మార్గం సుగమమైందని వెల్లడించారు. వైసీపీ హయాంలో పెండింగ్‌లో ఉన్న పంటలబీమా బకాయిల విడుదలకు కేంద్రం పచ్చజెండా ఊపినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
