ట్రాక్టర్ తో దున్నుతున్నమొక్కజొన్న పంటను సిపిఎం బృందం పరిశీలించడం జరిగింది. సోమవారం నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామంలో బోయ నర్సింహులు ఎనిమిది ఎకరాల మొక్కజొన్న పంటను ట్రాక్టర్ తో దున్నుతుండగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు సిపిఎం నాయకులు టి గోపాలకృష్ణ, కే తారేస్, రంగస్వామి, గ్రామ రైతు నాయకుడు రామ్ రెడ్డి గారు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఎం నాగేశ్వరావు మాట్లాడుతూ ఈ సంవత్సరం జూన్ మాసంలో ఖరీఫ్ పంటలు మొక్కజొన్న, పత్తి, మినుము, పెసర, కంది, మిర్చి, సోయాబీన్, తదితర పంటలు సాగు చేశారని పెట్టుబడి కోసం విత్తనాలు, భూమిలో మందు, వ్యవసాయ ట్రాక్టర్ మరియు వ్యవసాయం సేద్యం ఖర్చులు, కూలీలకు మొత్తం ఖర్చులు ఎకరాకు 10 వేల నుండి 30 వేల వరకు పెట్టుబడి పెట్టారని పంట వేసి రెండు నెలలు అవుతున్న తగినంత వర్షపాతం నమోదు కాకపోవడం మూలంగా రైతుల కళ్ళ ఎదుటనే పంటలు ఎండిపోతున్నాయి ,రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని కావున ప్రభుత్వం వెంటనే ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికి విత్తనాలు, ఎరువులు ఉచితంగా అందించాలని, బ్యాంకు పంట రుణాలు మాఫీ చేయాలని, ఎకరాకు 50 వేల రూపాయలు పంట నష్ట పరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, పంట భీమను ప్రభుత్వమే చెల్లించాలని ఆయన కోరారు,ప్రభుత్వం సకాలంలో స్పందించి ఆదుకోకపోతే రైతులు ఆత్మహత్య చేసుకుంటారని దానికి ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని వారు హెచ్చరించారు, కరువు సహాయక చర్యలు వెంటనే చేపట్టకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు
