నందికొట్కూర్ న్యూస్ జులై 28( ప్రతినిధి పగడం గోపి ) నందికొట్కూరు మండల పరిధిలోని దామగట్ల గ్రామంలో మండల వ్యవసాయ అధికారి పి షేక్ షావలి ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతు సేవ కేంద్రాల యొక్క సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పంటల యొక్క క్రాప్ కండిషను మరియు క్రాప్ సిచువేషన్ను రైతులతో చర్చించడం జరిగినది ఏపీ ఎయిమ్స్ యాప్ నందు ఎరువులు పంపిణీ గురించి చెప్పడం జరిగినది. తర్వాత వాతావరణ బీమా ఈ నెల 30 చివరి తేదీ మరియు ప్రధానమంత్రి ఫసల్ బీమా గురించి చెప్పడం జరిగినది ఈనెల 31వ తేదీ లోపల రెండిటికి లాస్ట్ డేట్ ఉంది రైతులందరూ క్రాప్ ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సిందిగా తెలియజేయడమైనది.
