నందికొట్కూరు న్యూస్
మిడ్తూరు మండలం జులై 27

పీరుసాహెబ్ పేట గ్రామం లో పొదుపు లక్ష్మీ సంఘ ఆధ్వర్యంలో రూ. 500,000/- లక్షలతో స్వయం ఉపాధి – PMEGP అంజలి చిక్కిస్ తయారీ మిషన్ ని ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP) ద్వారా చిక్కిల తయారీ (Chikki manufacturing) వంటి ఆహార పరిశ్రమ యూనిట్లను ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందవచ్చు. తయారీ రంగానికి గరిష్టంగా రూ. 50 లక్షల వరకు మరియు సేవా రంగానికి రూ. 20 లక్షల వరకు రుణం లభిస్తుంది అన్నారు.సబ్సిడీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక వర్గాలకు (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు) 35%, పట్టణ ప్రాంతాల్లో 25% వరకు మార్జిన్ మనీ సబ్సిడీ లభిస్తుంది. సాధారణ వర్గాల వారికి 15% నుండి 25% ఉంటుంది మహిళలకు వివరించారు.
అనంతరం: పీరుసాహెబ్ పేట గ్రామం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎంఆర్ఎఫ్ ద్వారా గోకు రామ్ ప్రసాద్ రెడ్డి గారికి రూ.103,211/- మంజూరైన చెక్కును కూటమి నాయకులతో కలిసి లబ్ధిదారునికి పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో: మండల నాయకులు కార్యకర్తలు మహిళాలు ప్రభుత్వ అధికారులు పాల్గొనడం జరిగింది

By 𝐃𝐫 𝐌 𝐇𝐀𝐑𝐈 𝐏𝐑𝐀𝐒𝐀𝐃

𝗗𝗿 🅼︎ 🅷︎🅰︎🆁︎🅸︎ 🅿︎🆁︎🅰︎🆂︎🅰︎🅳︎ is 🅳︎🅾︎🅲︎🆃︎🅾︎🆁︎. He is involved in providing 🅿︎🆄︎🅱︎🅻︎🅸︎🅲︎ 🆂︎🅴︎🆁︎🆅︎🅸︎🅲︎🅴︎🆂︎.