ఆశా కార్యకర్తలు తమ హక్కులు సాధించుకోవడానికి ఈ నెల 31వ తారీఖున కలెక్టర్ కార్యాలయం వద్ద మహాధర్నా సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని ప్రతి ఆశ కార్యకర్త హక్కుల కొరకు పోరాడాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎం కర్ణ శ్రీనివాసులు తెలిపారు
నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండల ఆరోగ్య కేంద్రంలో ఆశా కార్యకర్త భారతి తో కలిసి బుధవారం డాక్టర్ సభ మేడమ్ గారికి పర్మిషన్ లెటర్ అందజేశారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 31 వ తారీఖున సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ఆశా కార్యకర్తలకు కనీస వేతనం ఇవ్వాలని అన్ని రకాల సెలవులు ఇవ్వాలని పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా ఆశా కార్యకర్తల సంఖ్య పెంచాలని కాళీ పోస్టులు భర్తీ చేయాలని 10 లక్షలు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్ల పరిష్కారం కొరకు ఈ నెల 31న జరిగే మహా ధర్నాలో ప్రతి ఆశా కార్యకర్త పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు
