కర్నూల్, జులై 28:
జిల్లా మార్కెట్ యార్డులో గిట్టుబాటు ధర లేక అమ్ముడుపోని టమోటాలను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంత రైతులు తీసుకొచ్చిన టమోటాలకు కిలోకు రూ.15 ధర నిర్ణయించినప్పటికీ, బహిరంగ మార్కెట్లో ధర రూ.10 ఉండటంతో కొనుగోలుదారులు ముందుకు రాలేదు. దీంతో టమోటాలను ఉచితంగా పంపిణీ చేశారు..
నంద్యాల జిల్లా ఆత్మకూరు మార్కెట్ యార్డులో గిట్టుబాటు ధర లేకపోవడంతో టమోటాలను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంతానికి చెందిన రైతుల టమోటాలను కిలో 15 రూపాయల ప్రకారం విక్రయించాలని అధికారులు ఆత్మకూరు మార్కెట్ యార్డుకు తరలించారు. అయితే బహిరంగ మార్కెట్లో టమోటా ధర కిలోకు సుమారు 10 మాత్రమే ఉండటంతో మార్కెట్ యార్డులో 15 రూపాయల ధరకు కొనుగోలుదారులు ముందుకు రాకపోవడంతో టమోటాలు అమ్ముడుపోలేదు.
