నందికొట్కూరు న్యూస్ :ఎమ్మెల్యే గిత్తా జయ సూర్య.

•6 గురు లబ్ధిదారులకు 5,71,588/- లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు లు పంపిణి

కొత్తపల్లి మండలం పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి  ఒక సంజీవనిలా మారిందని, నిరుపేదల ఆరోగ్య భద్రతకు ఈ నిధి ఎంతో భరోసానిస్తోందని నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య  అన్నారు.

(1) కొత్తపల్లి మండలం అమేలమ్మ గారికి రూ.41,267/- (2) వడ్ల వెంకటరత్నం ఆచారి గారికి రూ. 70,000 మరియు (3) గోకవరం గ్రామానికి చెందిన కే ఏసేపు గారికి రూ.43,914/- (4)గోకవరం గ్రామం కి చెందిన భాగ్యమ్మ గారికి రూ.25,166/- (5) గువ్వలకుంట్ల గ్రామానికి చెందిన సోమేశ్వర రెడ్డి గారికి రూ.3,16,027/- (6) ఆవుల నాగార్జున రెడ్డి గారికి గారికి రూ.75,214/- చొప్పున లబ్ధిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కొత్తపల్లి మండలం ఎమ్మార్వో కార్యాలయంలో స్వయంగా అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ, ఆర్థిక స్థోమత లేక కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి కొండంత అండగా నిలుస్తోందని కొనియాడారు. సమయానికి వైద్యం అందక, అప్పుల పాలవుతున్న ఎన్నో కుటుంబాలను కూటమి ప్రభుత్వం ఈ నిధి ద్వారా ఆదుకుంటోందని, నిరుపేదలు అనారోగ్యం బారిన పడినప్పుడు అధైర్యపడకుండా ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలనేదే తమ సంకల్పమని ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వరగా నిధులు మంజూరయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు ఆయన  వివరించారు.
ఈ కార్యక్రమంలో కూటమి మండల నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

By 𝐃𝐫 𝐌 𝐇𝐀𝐑𝐈 𝐏𝐑𝐀𝐒𝐀𝐃

𝗗𝗿 🅼︎ 🅷︎🅰︎🆁︎🅸︎ 🅿︎🆁︎🅰︎🆂︎🅰︎🅳︎ is 🅳︎🅾︎🅲︎🆃︎🅾︎🆁︎. He is involved in providing 🅿︎🆄︎🅱︎🅻︎🅸︎🅲︎ 🆂︎🅴︎🆁︎🆅︎🅸︎🅲︎🅴︎🆂︎.