ఆగస్టు 3 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించనున్నారు. అర్హత ఉన్నప్పటికీ జాబితాలో పేరు లేకపోయినా, మొదటి విడతలో నిధులు అందకపోయినా సంబంధిత స్వర్ణ గ్రామ లేదా వార్డు కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.
ఆగస్టు 4 నుంచి 10 వరకు ఫిర్యాదులను పరిశీలించి అదనపు అర్హుల జాబితా సిద్ధం చేస్తారు. అలాగే కొత్తగా ఒకటో తరగతి, జూనియర్ ఇంటర్‌లో చేరిన విద్యార్థుల వివరాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు.
అర్హులుగా గుర్తించిన లబ్ధిదారుల జాబితాను ఆగస్టు 30న విడుదల చేసి, అదే రోజు తల్లుల బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సాయం జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
