NTR Bharosa Pension Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పేదలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించడం కోసం, ఆర్థికంగా అండగా నిలవడం కోసం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత కార్మికులు, కల్లు గీత కార్మికులు, ట్రాన్స్‌జెండర్లు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆర్థిక సాయం అందిస్తోంది. ఎన్టీఆర్ భరోసా కింద అందిస్తున్న వివిధ పింఛన్లకు అర్హతలు ఏంటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎవరికి ఎంత పెన్షన్ ఇస్తున్నారు? ఫిర్యాదులు ఉంటే ఎలా చేయాలి? తదితర పూర్తి వివరాలు..
రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ గౌరవప్రదమైన జీవితాన్ని అందించే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, గీత కార్మికులు, నేత కార్మికులు తదితర సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఆర్థికంగా భద్రత కల్పిస్తోంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం (NTR Bharosa Pension Scheme) కింద ఆయా వర్గాల వారికి నెలకు రూ. 4000 నుంచి రూ. 15,000 వరకు ఆర్థిక సాయం అందిస్తున్నారు.

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అంటే ఏమిటి?

పేద వర్గాల్లో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కూలీలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు నెల నెలా పింఛన్ రూపంలో ఆర్థిక సాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది. ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 4 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు స్వయంగా పాల్గొంటున్నారు. ఒకవేళ 1వ తేదీ ఏదైనా పబ్లిక్ హాలీడే ఉంటే.. అంతకంటే ముందే (ముందు నెల 30 లేదా 31) పింఛన్ల పంపిణీ ప్రారంభిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కింద ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నారు. పింఛన్ రకాన్ని బట్టి ప్రస్తుతం రూ. 4000 నుంచి రూ. 15000 వరకు లబ్ధిదారుల ఇంటికే వెళ్లి వాలంటీర్స్ వారికి పెన్షన్ అందిస్తున్నారు.

ఎన్టీఆర్ భరోసా పథకం లక్ష్యాలు:
★ వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు, డయాలసిస్ పేషంట్లు మరియు ఇతర సామాజికంగా వెనుకబడిన వర్గాలకు భద్రతా కల్పన.
★ వారిని ఆర్థికంగా స్వావలంబులుగా చేయడం.
★ నిర్లక్ష్యానికి గురికాకుండా గౌరవభరితమైన జీవితాన్ని అందించేందుకు కృషి చేయడం.

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో భాగంగా అందిస్తున్న 14 రకాల పెన్షన్లు:
✧ వృద్ధాప్య పింఛన్ – నెలకి రూ. 4000
✧ వితంతువు పింఛన్ – నెలకి రూ. 4000
✧ ఒంటరి మహిళ పింఛన్ – నెలకి రూ. 4000
✧ వికలాంగుల పింఛన్ – నెలకి రూ. 6000 లేదా రూ. 15000
✧ కల్లు/గీత కార్మికుల పింఛన్ – నెలకి రూ. 4000
✧ నేత కార్మికులు పింఛన్ – నెలకి రూ. 4000
✧ మత్స్యకారుల పింఛన్ – నెలకి రూ. 4000
✧ యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ART) పింఛన్ – నెలకి రూ. 4000
✧ సాంప్రదాయ చర్మకారుల పింఛన్ – నెలకి రూ. 4000
✧ ట్రాన్స్‌జెండర్ పింఛన్ – నెలకి రూ. 4000
✧ డప్పు కళాకారుల పింఛన్ – నెలకి రూ. 4000
✧ సీకేడీయూ పింఛన్ (C.K.D.U. Pension) – నెలకి రూ. 10,000
✧ సైనిక్ సంక్షేమ పింఛన్లు – నెలకి రూ. 5000
✧ అమరావతి భూమిలేని పేదల పింఛన్ – నెలకి రూ. 5000
✧ అభయహస్తం పింఛన్ – నెలకి రూ. 500

దరఖాస్తు ఫారం:
ఎన్టీఆర్ భరోసా అప్లికేషన్ ఫామ్‌లను ఈ కింది లింక్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి..

12. సీకేడీయూ పింఛన్ (C.K.D.U. Pension)
★ కిడ్నీ, కాలేయం సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులు, గుండె మార్పిడి, CKDU పేషంట్లు, ఎలిఫాంటియాసిస్-గ్రేడ్ 4 పేషంట్లు దీని ద్వారా రూ.10,000 పింఛన్‌కు అర్హులు.
★ ప్రభుత్వ లేదా నెట్‌వర్క్ ఆసుపత్రులలో డయాలసిస్ చేయించుకుంటున్న కిడ్నీ వ్యాధిగ్రస్థులు కూడా ఈ పింఛన్‌కు అర్హులు.
★ ఈ పింఛన్ ద్వారా లబ్ది పొందేందుకు ఎలాంటి వయోపరిమితి లేదు.
★ ఈ పింఛన్ కోసం ఆస్పత్రి ద్వారా దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం మంజూరు చేస్తుంది.

13. సైనిక్ సంక్షేమ పింఛన్లు (Sainik Welfare Pensions), అమరావతి భూమిలేని పేదల పింఛన్ (Amaravathi Landless Poor Pension)
★ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ (MAUD) డిపార్ట్‌మెంట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (APCRDA) ప్రాంతంలో భూమిలేని పేదలు ఈ పింఛన్‌కు (నెలకి రూ. 5000) అర్హులు.
★ దీనికి ఎలాంటి వయో పరిమితి లేదు.
★ ఈ పింఛన్ కోసం అమరావతిలో ఉండే భూమి లేని పేద ప్రజలు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

14. యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ART) పింఛన్ (ART [PLHIV] Pension)
★ కనీసం 6 నెలల కాలంగా యాంటీ రెట్రో వైరల్‌ తెరపీ ట్రీట్‌మెంట్ తీసుకునే వారు ఈ పింఛన్‌కు అర్హులు
★ ఈ పింఛన్ ద్వారా లబ్ధి పొందేందుకు ఎలాంటి వయో పరిమితి నిబంధన లేదు.
★ ఈ పింఛన్ కోసం ఆస్పత్రి ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకానికి ఆఫ్‌లైన్‌లో, ఆన్‌లైన్‌లో రెండు మార్గాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

1. ఆఫ్‌లైన్ విధానం:
✧ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కోసం గ్రామ/ వార్డ్ (మెప్మా ఆఫీస్) సచివాలయంలోనూ దరఖాస్తు చేసుకోవచ్చు.
✧ యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ART) పెన్షన్, CKDU పెన్షన్, సైనిక్ సంక్షేమ పింఛన్లు, అమరావతి భూమిలేని పేదల పెన్షన్, అభయహస్తం పెన్షన్ కోసం మాత్రం సంబంధింత కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. (గ్రామ/ వార్డు సచివాలయంలో ఈ 5 రకాల పింఛన్లకు దరఖాస్తు అందుబాటులో లేదు).
✧ దరఖాస్తు ఫారాన్ని జాగ్రత్తగా నింపి, అవసరమైన పత్రాలన్నింటినీ జతచేసి సమర్పించాలి.

2. ఆన్‌లైన్ దరఖాస్తు:
✧ అర్హులైన అభ్యర్థులు మీ సేవా/గ్రామ సచివాలయం పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
✧ అధికారిక వెబ్‌సైట్ https://sspensions.ap.gov.in లో కుడివైపున ఉన్న లాగిన్‌పై క్లిక్ చేయాలి.
✧ మీ మొబైల్ నంబర్, క్రెడిన్షియల్స్ ఎంటర్ చేస, యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఇవ్వాలి. ఆ తర్వాత ‘Get OTP’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
✧ అనంతరం మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు OTP వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత దరఖాస్తు ఓపెన్ అవుతుంది.
✧ అనంతరం అక్కడ ఇచ్చిన సూచనల ఆధారంగా మీ వివరాలు నమోదు చేయాలి.
✧ అవసరమైన పత్రాలన్నింటినీ అప్‌లోడ్ చేసి, ‘SUBMIT’ బటన్‌పై క్లిక్ చేయాలి.
✧ అప్లికేషన్ నంబర్ ఆధారంగా దరఖాస్తు స్థితిని చెక్ చేసుకోవచ్చు.

By 𝐃𝐫 𝐌 𝐇𝐀𝐑𝐈 𝐏𝐑𝐀𝐒𝐀𝐃

𝗗𝗿 🅼︎ 🅷︎🅰︎🆁︎🅸︎ 🅿︎🆁︎🅰︎🆂︎🅰︎🅳︎ is 🅳︎🅾︎🅲︎🆃︎🅾︎🆁︎. He is involved in providing 🅿︎🆄︎🅱︎🅻︎🅸︎🅲︎ 🆂︎🅴︎🆁︎🆅︎🅸︎🅲︎🅴︎🆂︎.