నందికొట్కూరు న్యూస్ జులై 28( ప్రతినిధి పగడం గోపి) పగిడాల మండల పరిధిలోని పాతకోట గ్రామం నందు జమ్ములమ్మ గుడి  సమస్య గత కొన్ని రోజుల క్రితం వివాస్పదంగా మారింది. ఈ సమస్యపై రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం  ముచ్చుమర్రి ఎస్సై నరేంద్ర తో కలిసి ప్రజలతో గ్రామసభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సైబర్ మోసాలు, బాల్యవివాహాలు, మహిళల భద్రత చట్టాలపై, శక్తి యాప్ వినియోగంపై, సీసీ కెమెరాల ఏర్పాటు పై ప్రజలతో చర్చించారు. జమ్మలమ్మ గుడి వివాదంలో ఎలాంటి మనస్పర్ధలకు తావు లేకుండా  ఐక్యంతో ముందుకు సాగాలని  ప్రజలతో చర్చించి సిఐ సమస్యను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

By 𝐃𝐫 𝐌 𝐇𝐀𝐑𝐈 𝐏𝐑𝐀𝐒𝐀𝐃

𝗗𝗿 🅼︎ 🅷︎🅰︎🆁︎🅸︎ 🅿︎🆁︎🅰︎🆂︎🅰︎🅳︎ is 🅳︎🅾︎🅲︎🆃︎🅾︎🆁︎. He is involved in providing 🅿︎🆄︎🅱︎🅻︎🅸︎🅲︎ 🆂︎🅴︎🆁︎🆅︎🅸︎🅲︎🅴︎🆂︎.