నందికొట్కూరు న్యూస్ : (ప్రతినిధి పగడం గోపి )
ఆత్మకూరు సబ్ డివిజన్ ” శక్తి టీమ్ సిబ్బంది నంద్యాల జిల్లా ఎస్పి సుశీల్ షోరాన్ ఆదేశాల మేరకు, ఆత్మకూరు డి.ఎస్.పి రామాంజీనాయక్ ఉత్తర్వుల మేరకు బ్రాహ్మణ కొట్కూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని బొల్లవరం గ్రామం జడ్పీహెచ్ఎస్ లోని 5 నుండి 10 వ తరగతి విద్యార్థి, విద్యార్ధినులకు అమ్మయిల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ” శక్తి యాప్ ” గురించి, బాడ్ టచ్ గుడ్ టచ్ మరియు శక్తి యాప్ వాట్సాప్ నంబర్ 7993485111 గురించి తెలుపుతూ, మహిళల రక్షణకై ఏర్పాటు చేసిన పోక్సో చట్టం గురించి బాల్యవివాహాలు, చిన్న పిల్లలపై నేరాలు జరగకుండా ఆపుటకు 1098 ఫిర్యాదు చేయవలెనని, 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయకూడదని అట్లా ఎవరయినా చేస్తునట్లయితే 112 కు గానీ, 1098 కి ఫోన్ చేసి చెప్పాలని తెలుపుతూ ఎమర్జెన్సీ కాల్ 112, 100 కి ఫోన్ చేయవలెనని, సైబర్ క్రైమ్ జరిగినచో టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి ఫోన్ చేయవలెనని, ఫేక్ కాల్స్,Apk ఫైల్స్ లాంటివి ఏదన్నా మీ పేరెంట్స్ వాట్స్ అప్ లకు ఎవరైనా పంపితే వాటిని ఓపెన్ చేయొద్దు తెలిపారు.
ఈ ప్రోగ్రాం లో స్కూల్ హెచ్ఎం అయిన రామకృష్ణ,శక్తి టీం అయిన ఏఐఎస్ఐ నాగన్న, పీసీ రసూల్ తో పాటు టీచింగ్ స్టాఫ్ రామ్మోహన్, జయమ్మ, షబ్బీర్, సుమిత్ర, లక్ష్మీదేవి,సునీత, లక్ష్మీనారాయణ ఆచారి పాల్గొన్నారు.


