దూదేకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు SS భాజీ గారి జన్మదిన సందర్బంగా నందికొట్కూరు పట్టణంలో NS ఫంక్షన్ హాల్ లో దూదేకుల సంఘం ఆధ్వర్యంలో మెగా రక్త దాన శిభిరం ఏర్పాటు చేయటం జరిగింది. దాదాపుగా 50 మందికి పైగా రక్త ధానం చేయటం జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయినా కూడా మా దూదేకుల జాతి ని ఏ రాజకీయ పార్టీ కానీ, ఇప్పటి వరకు వచ్చిన అన్ని ప్రభుత్వాలు మా జాతికి అన్యాయం చేస్తూనే ఉన్నాయ్, ఇప్పటికి మా దూదేకుల జాతి ఆర్థికంగా, సామజికంగా, రాజకియంగా వెనకబడి ఉన్నాము. మా దూదేకుల జాతికి రాబోయే ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీ లు కనీసం 2 MLA సీట్లు ఒక MP సీటు కేటాయించాలి. అపుడే మరి దూదేకుల జాతి సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపిస్తాం. మాకు ఏ పార్టీ సీట్లు కేటాయించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మా దూదేకుల జాతికి ఎక్కడ అయితే ఓటు బ్యాంకు ఉందొ అక్కడ మేము స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తాము. ఈ కార్యక్రమం లో దూదేకుల సంఘం తాలూకా అధ్యక్షులు మహాభాష, మాజీ కౌన్సిలర్ చంద్రబాబు భాషా, రైతు సంఘం బాబు, బాబు తిక్కయ్య మరియు దూదేకుల సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

By 𝐃𝐫 𝐌 𝐇𝐀𝐑𝐈 𝐏𝐑𝐀𝐒𝐀𝐃

𝗗𝗿 🅼︎ 🅷︎🅰︎🆁︎🅸︎ 🅿︎🆁︎🅰︎🆂︎🅰︎🅳︎ is 🅳︎🅾︎🅲︎🆃︎🅾︎🆁︎. He is involved in providing 🅿︎🆄︎🅱︎🅻︎🅸︎🅲︎ 🆂︎🅴︎🆁︎🆅︎🅸︎🅲︎🅴︎🆂︎.