కర్నూలు జిల్లా…
సీమ్ కార్డుల పేరుతో ఏటీఎంల ద్వారా నగదు డ్రా చేసిన ఇద్దరు అరెస్ట్…
రూ. 5 లక్షల నగదు, 105 ఏటీఎం కార్డులు, రెండు సెల్‌ఫోన్లు, బయోమెట్రిక్ ఫింగర్‌ప్రింట్ పరికరం స్వాధీనం.
సీమ్ కార్డుల పేరుతో ప్రజల వ్యక్తిగత వివరాలను దుర్వినియోగం చేసి, ఏటీఎం కార్డుల ద్వారా నగదు డ్రా చేసిన ఇద్దరు నిందితులను కర్నూలు వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుల నుంచి రూ. 5,00,000 నగదు, 105 ఏటీఎం కార్డులు, రెండు సెల్‌ఫోన్లు, బయోమెట్రిక్ ఫింగర్‌ప్రింట్ పరికరం స్వాధీనం చేసుకున్నారు.
ప్రజల ఆధార్, బయోమెట్రిక్ వివరాలను అక్రమంగా సేకరించి, కొత్త సీమ్ కార్డులు యాక్టివేట్ చేసి బ్యాంకు ఖాతాలకు అనుసంధానించి మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, వన్‌టౌన్ సీఐ శ్రీ మారుతి శంకర్, సీసీఎస్ సీఐ శ్రీ పూల రామకృష్ణ, సైబర్ సెల్ సీఐ శ్రీ వై. ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు.
ఈ కేసును ఛేదించిన అధికారులను పోలీసులు జిల్లా ఎస్పీ అభినందించారు.
