సంజీవని కార్యకమ్రంతో రాష్ట్రంలోని అన్ని హాస్పిటల్స్, ఏఎన్ఎంల నుంచి సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల వరకూ ఒకే నెట్వర్క్ కిందకు వస్తారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ కార్యక్రమం కింద నచ్చిన డాక్టర్తో, నచ్చిన వైద్యం చేయించుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కర్నూలు జిల్లా ఆస్పరి పీహెచ్సీలో సంజీవని కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. ఆగస్టు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వస్తుందని చెప్పారు. ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు.
