గ్లోబల్ స్టార్, ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఒక దిగ్భ్రాంతికరమైన వార్త. ఒక కార్యక్రమంలో పాల్గొంటున్న సమయంలో ఆయన భుజానికి తీవ్ర గాయమైంది. అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో తారక్ వెంటనే వైద్యులను ఆశ్రయించగా, ఆయనను క్షుణ్ణంగా పరిశీలించిన వైద్య బృందం కొన్ని వారాల పాటు షూటింగ్‌లకు, పబ్లిక్ ఈవెంట్లకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. ఈ వార్త బయటకు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
