125 వ రోజు కొనసాగిన శ్రీశైలం నీటిముంపు బాధితుల  నిరాహార దీక్షలు.

నంది కొట్కూర్ న్యూస్ (ప్రతినిధి- పగడంగోపి)                                                   
రెండు రోజుల పర్యటనకు రాయలసీమ రానున్న గౌరవ లోకేష్  నంది కొట్కూర్ లో శ్రీశైలం ముంపు భాదితులకు యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామిని గుర్తుకు చేసుకొని తాము కొనసాగిస్తున్న రిలే నిరాహార దీక్షల 125వ రోజులుగా సాగుతున్న దీక్షాశిభిరము వద్దకు వచ్చి మాకు న్యాయము చెయ్యాలని ముంపు నిర్వాసితుడు జయన్న అభ్యర్ధించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు  రాయలసీమ వాసులకు ఇచ్చిన జీవో 98 ఉత్తర్వును తుంగలో తొక్కి గౌరవ నీటిపారుదల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు  తన ఇలాఖాలోని పాలకొల్లు ప్రాంతాలకు 1085 లస్కర్ పోస్టులు భర్తి చేసిన మీరు స్వయంగా హామి ఇచ్చిన శ్రీశైలం ముంపు భాదితులకు అన్యాయం జరుగుతుంటే మీరు మౌనంగా వుండటం మీ తాతగారైన స్వర్గీయ ఎన్టీఆర్  ఆశయాలకు పాతరేసి ఆయన ఆశయాలను నెరవేర్చకపోవడం ఎన్టీఆర్ గారి ఆత్మ క్షోభిస్తుందని ముంపు నిర్వాసితుడు జయన్న లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ జీవో 98 ద్వారా ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూసి మానసిక క్షోభకు గురయి కుటుంభ పోషణ జరగక 32 మంది లబ్దిదారులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారని గౌరవ లోకేష్ గారు వారి తాత స్వర్గీయ ఎన్టీఆర్ లాగా మానవతా దృక్పధంతో వ్యవహరించాలని లేకపోతే మహానుభావునికి కించపరిచినట్లవుతుందని జయన్న ఆ క్రోసించారు. మీ తాతగారు, మీనాన్న గారు మరియు మీరు ముగ్గురు నాయకులుగా మాకు హామీ ఇచ్చారని ఇప్పటికైనా గుర్తుకు చేసుకొని మాకు న్యాయం చేసి మా మరణాలు ఆపాలని కోరుతున్నాము. అలాగే రేపు పర్యటనలో Go 98 విషయం వారిచ్చిన హామిల అమలు మరియు మేం చేస్తున్న దీక్షల గురించి జిల్లా స్థాయి నేతలు నాయకులు ఆయన దృష్టికి తీసుకెళ్ళి మాన్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు. ఈ దీక్షలో జంభన్న నారాయణ, నాగసుం కన్న నాగరాజు, బాలక్రిష్ణ ‘ రవి, పవన్, జయన్న రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు

By 𝐃𝐫 𝐌 𝐇𝐀𝐑𝐈 𝐏𝐑𝐀𝐒𝐀𝐃

𝗗𝗿 🅼︎ 🅷︎🅰︎🆁︎🅸︎ 🅿︎🆁︎🅰︎🆂︎🅰︎🅳︎ is 🅳︎🅾︎🅲︎🆃︎🅾︎🆁︎. He is involved in providing 🅿︎🆄︎🅱︎🅻︎🅸︎🅲︎ 🆂︎🅴︎🆁︎🆅︎🅸︎🅲︎🅴︎🆂︎.