ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగ యువతకు ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ (APCOB) శుభవార్త తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు జిల్లాల కోఆపరేటివ్ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. మొత్తం 338 ఉద్యోగాల భర్తీ కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశమని, అర్హత కలిగిన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
